‘ఆచార్య’ నుండి రామ్ చరణ్ న్యూ లుక్‌..

149
Ram Charan
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఈ రోజు ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ వెల్లడించింది.

“ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి” అంటూ ట్వీట్ చేసింది. “రీసెంట్‌గా ‘ఆచార్య’ ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాం. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను తెలియజేస్తాం. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు, లాహే లాహే సాంగ్‌కు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది” అని చిత్ర యూనిట్‌ తెలియజేసింది.

తాజాగా ఆచార్య సినిమా నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో చరణ్ గుబురు మీసాలతో , మెడలో రుద్రాక్ష ధరించి, నుదిటిన బొట్టుతో కనిపించారు. ఆచార్య లో సిద్ద అనే పాత్రలో చరణ్ నటిస్తున్నారు. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -