మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మెగాఫోన్ పట్టిన హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్‌లతో జోష్‌లో ఉన్న తేజ్..ప్రస్తుతం గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో ఢీలా పడ్డ తేజ్..తన పుట్టినరోజు సందర్భంగా కొత్తమూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేయనున్నారు. ఈ సినిమా ముహుర్తపు షాట్‌కు దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టగా అట్టహాసంగా ప్రారంభమైంది. చిత్రలహరి అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో కలయని ప్రయదర్శన్ హీరోయిన్‌గా నటించనుంది.
ఇక తేజు పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. తేజు భాయ్ సాయి ధరమ్ తేజ్… విష్ యు ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే. భగవంతుడు నీకు జీవితంలో చాలా ప్రేమతో పాటు సక్సెస్, ప్రశాంతత ఉండేలా చూడాలని కోరుకుంటున్నా..ఫోటోను షేర్ చేశారు. ఈ పిక్‌లో సాయిధరమ్, చెర్రీతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నీహారిక తదితరులు కనిపిస్తు ఫ్యాన్స్‌ను ఖుష్ చేశారు.