మెగా హీరోలు ఏం చేసినా అది సోషల్‌మీడియాలో హాట్ టాపికే. అందులో ముఖ్యంగా రామ్ చరణ్,బన్నీ, వరుణ్ తేజ్‌లకు సంబంధించిన వార్తైతే నెట్టింట్లో హల్ చల్ చేయాల్సిందే. ఇక ఇందులో ఏ ఇద్దరు హీరోలు కలిసిన ఫ్యాన్స్‌కు పండగే. గతంలో రామ్‌చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ కలిసి విహారయాత్రకు వెళ్లిన ఫోటోలు వైరల్‌గా మారగా తాజాగా చెర్రీ, వరుణ్ తేజ్ దిగిన గడ్డం ఫోటో అభిమానులను తెగ అలరిస్తోంది.
వరుణ్ తేజ్ రామ్‌చరణ్‌తో కలిసి సరదాగా దిగగిన ఫొటోలో ఇద్దరూ గెడ్డంతో ఉన్నారు. ఈ ఫొటోను వరుణ్ తేజ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఈ ఫొటో తీసిన చరణ్ భార్య ఉపాసనకు ధన్యవాదాలు చెప్పారు. ఈ ఫోటోను షేర్ చేస్తున్న ఫ్యాన్స్ కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు.
ధృవ సినిమా సక్సెస్ తర్వాత ప్రస్తుతం రామ్‌చరణ్ ‘రంగస్థలం 1985’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కోసమే ఆయన అలా గెడ్డం పెంచుకున్నారు. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా సమంత నటిస్తున్నారు. వేసవి కానుకగా మార్చి 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరో వైపు ఫిదా హిట్ తర్వాత వరుణ్‌తేజ్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వరుణ్‌కు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా ప్రేమకథా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 9 2018లో సినిమా ప్రేక్షకుల ముందుకువస్తున్నట్లు వరుణ్ ట్వీట్ చేశారు.
గతంలో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో డిఫరెంట్ గడ్డం గెటప్‌తో కనిపించగా నితిన్ లై సినిమాలో గడ్డం ట్రెండ్‌నే ఫాలో అయ్యాడు .తాజాగా మెగా హీరోలు గడ్డం బ్యాచ్‌లోకి చేరి పోయారు.
The bearded duo!
P.C- @upasanakonidela thanks for the lovely picture
#brother#beardos pic.twitter.com/SkFbGwdmZi— Varun Tej Konidela (@IAmVarunTej) November 2, 2017