శివ 2 : నాగ్ – వర్మ కొత్త సినిమా

255
Shiva-2 from Nov-20
- Advertisement -

శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వినూత్నమైన టేకింగ్ తో.. ఒక కొత్త ఒరవడితో తెరకెక్కించిన శివ సినిమా ప్రేక్షకులు మరవలేని రీతిలో తెరకెక్కించాడు  వర్మ. నాగార్జున హీరోగా నటించిన శివ చిత్రం ఇప్పటికీ చూస్తుంటే.. అంతే ఇంటెన్సిటీతో కనిపిస్తుంది. ఇక శివ తర్వాత రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్నో సినిమాలు చేస్తూ.. తనదైన కమెంట్స్ తో సోషల్ మీడియాలో సంచలన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. వర్మ తీసిన రక్తచరిత్ర, వంగవీటి లాంటి బయోపిక్స్ తో తెలుగు సినిమా కొత్త పంథాలోకి వెళ్లింది.

nagarjuna-and-rgv-film-

అయితే గత కొంత కాలంగా నాగార్జున అండ్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కూడా రాజు గారి గాది 2 ప్రమోషన్స్ లో వర్మ తో ఒక సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా నవంబర్ 20న అన్నపూర్ణ స్టూడియోస్ లో స్టార్ట్ అవ్వనుందని వర్మ తన ఫెస్ బుక్ లో పోస్ట్ చేశాడు వర్మ. అదే విధంగా శివ సినిమా అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కడ స్టార్ట్  అయ్యిందో అక్కడే స్టార్ట్ కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -