విశ్వక్‌ సేన్‌కి పెద్ద ఫ్యాన్‌ని: రామ్ చరణ్‌

95
ram charan
- Advertisement -

అశ్విన్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓరి దేవుడా. దీపావళి కానుకగా ఈ నెల 21న సినిమా రిలీజ్ కానుండగా తమిళ చిత్రం ఓ మై కడవులే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళంలో దర్శకత్వం వహించిన అశ్విన్‌ తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ… విశ్వక్ సేన్ యాటిట్యూడ్ చూపిస్తారని.. ఆయనకు దూకుడు ఎక్కువని చాలా మంది అనుకుంటారు…కానీ మాటమీద నిలబడే వ్యక్తి అని కొనియాడారు చరణ్. ఒక్కసారి మాటిస్తే ఎన్ని అవాంతరాలు వచ్చినా దాని మీదే నిలబడతారని చెప్పారు.

విశ్వక్ సేన్ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరని.. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్‌తో అందరి గుండెల్లో స్ధానం సంపాదించారని తెలిపారు. విశ్వక్ సినిమాల్లో ‘ఫలక్‌నుమా దాస్’ చూశాను. ఇతనికి యూత్, రెబల్, రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్‌ని. సినిమాలో హీరో కన్నా బయట ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్ అని తెలిపారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -