శంకర్‌ మూవీ కోసం రెడీ అవుతున్న రాంచరణ్‌..

119
Ram Charan

టాలీవుడ్‌ హీరో మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ తమిళ టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌తో ఓ భారీ బడ్జెట్‌ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో కియారా క‌థానాయిక‌గా ఎంపికైన విష‌యాన్ని రీసెంట్‌గా చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

అయితే ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి దర్శకుడిగా శంకర్ తన వైపు నుంచి అన్ని పనులు చకచకా పూర్తి చేస్తున్నాడట. అంతేకాదు వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగును జూన్ నాటికి పూర్తి చేసేలా శంకర్ – దిల్ రాజు మాట్లాడుకున్నారట. అంటే చరణ్ నుంచి ఈ దసరాకి ‘ఆర్ ఆర్ ఆర్’ వస్తే, వచ్చే దసరాకి శంకర్ సినిమా వస్తుందన్న మాట.