అనాథలకు అమ్మలా అన్నం తినిపించిన మంత్రి ఎర్రబెల్లి..

111
- Advertisement -

అనాథలను ఆర్దికంగా బలోపేతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి వరంగల్‌ సుబెదారిలోని బాల సదన్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించి, పిల్లల బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రుల వెంట మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత,రాష్ట్ర జల వనరుల శాఖ చైర్మన్ వి.ప్రకాష్, జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు, మేయర్ గుండు సుధారాణి ఉన్నారు.

బాల సదన్‌లో ఉన్న 52 మంది పిల్లలతో కలిసి మంత్రులు, కలెక్టర్, మేయర్ అల్పాహారం చేసి వారితో ముచ్చటించారు. ఇక్కడ ఆహారం ఎలా పెడుతున్నారు, ఇంకా ఏమి కావాలి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి వసతులు, ఏర్పాట్ల గురించి సమీక్షించారు. సీఎం కేసిఆర్ ఆలోచన మేరకు ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే అనాథ పిల్లల జీవితాలు బాగు పడుతాయి అని అడిగారు. దీనికి సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్రంలోని అనాథలకు తల్లిదండ్రిగా వారి సంపూర్ణ సంరక్షణ బాధ్యతలు తీసుకొనీ, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించాలని, ఆడపిల్లలకు పెళ్లి కూడా చేయాలని ఇటీవలి కేబినెట్ సమావేశంలో సీఎం కేసిఆర్ నిర్ణయించినట్లు మంత్రులు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ దృష్టికి అనాథ పిల్లల గురించి కొన్ని సంఘటనలు వచ్చాయన్నారు.వారిని ఆర్దికంగా బలోపేతం చేయాలి, వారి పెళ్ళిళ్ళు చేయాలనీ సీఎం కేసిఆర్ ఆలోచని తెలిపారు. రోడ్ల మీద ఏ పిల్లలు పనులు చేయకుండా వారిని ఆశ్రమాల్లో పెట్టీ సంరక్షణ చేయాలి అన్నారు. బాల సదన్ లో నేడు పిల్లలతో, అధికారులతో మాట్లాడి, వారి అవసరాలు తెలుసుకున్నాన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి సలహాలు తీసుకుని ఈ కమిటీ నివేదిక ఇస్తుందని ఆయన అన్నారు.

- Advertisement -