13 ఏళ్లు పూర్తి చేసుకున్న రామ్ చరణ్..

405
ram charan
- Advertisement -

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఆ తర్వాత ‘మగధీర’ మూవీతో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు‌. ఈ రోజు చరణ్ సినీ కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే.. చిరుత చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన రామ్ చ‌ర‌ణ్ నేటితో (సెప్టెంబ‌ర్ 28) త‌న 13 ఏళ్ళ సినీ ప్ర‌స్థానం పూర్తి చేసుకున్నాడు. పదమూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు 2007 సెప్టెంబర్ 28న రామ్ చరణ్ అనే నటుడు ప్రేక్షకులకు ఎవరో తెలిసింది. ఈ సంద‌ర్భంగా మెగా ఫ్యాన్స్ 13YearsForRamCharanInTFI అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు.

అయితే కెరీర్‌లో 13 ఏళ్ళు పూర్తి అయిన సంద‌ర్భంగా చెర్రీ ట్వీట్ చేశారు. 13 ఏళ్ళు పూర్త‌య్యాయంటే న‌మ్మశ‌క్యంగా లేదు.ఎల్లప్పుడూ నాకు స‌పోర్ట్‌గా నిలిచిన నా ప్రియమైన అభిమానులకు ధన్యవాదాలు. మీ ప్రేమ‌కు నేను ధ‌న్యుడిని. మీ కోసం ఇంకా క‌ష్ట‌ప‌డ‌తాన‌ని ప్రామిస్ చేస్తున్నాను. చిరుత షూటింగ్‌కు సంబంధించిన ప్ర‌తిరోజు నాకు బాగా గుర్తుంది. నిన్న మొన్ననో షూటింగ్‌లో పాల్గొన్న‌ట్టు అనిపిస్తుంది. పూరీ జ‌గ‌న్‌, వైజ‌యంతి ఫిలింస్, నేహా శ‌ర్మ‌, మ‌ణిశ‌ర్మ‌తో పాటు చిత్ర బృందానికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న పూరీకు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు అని చ‌ర‌ణ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

రామ్ చరణ్ తన ఒక్కొక్క చిత్రంతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. చరణ్ రెండో చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. మగధీర చిత్రంతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ఆ త‌ర్వాత ఆరెంజ్, రచ్చ, నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ, ధృవ, రంగస్థలం, విన‌య విధేయ రామ‌ ఇలా ఒక్కో చిత్రంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. రంగస్థలం చిత్రంతో చెర్రీ త‌న న‌ట విశ్వ‌రూపం చూపించి తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అని నిరూపించుకున్నాడు.

ప్ర‌స్తుతం చరణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నున్నాడు. మరోవైపు తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్.

- Advertisement -