అభిమానులకు షాకిచ్చిన మిస్టర్ కూల్..

279
Dhoni Steps Down As Captain Of India ODI And T20I Teams
- Advertisement -

భారత క్రికెట్‌ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. గంగూలీ తర్వాత టీమిండియాను విజయాల వైపు నడిపిన నాయకునిగా మన్ననలు పొందిన మహేంద్రసింగ్ ధోనీ…టీమిండియా వన్డే, టీ 20 కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనానికి వేదికయ్యాడు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఆస్ర్టేలియాతో సిరీస్‌లో అనూహ్యంగా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన 35 ఏళ్ల ధోనీ… తాజాగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికి అభిమానులను ఆశ్చర్యంలో పడేశాడు.క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేశాడు. అయితే ఉరట కలిగించే విషయం ఏమిటంటే ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడని ధోని నిర్ణయాన్ని బీసీసీఐ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

Dhoni Steps Down As Captain Of India ODI And T20I Teams

2007లో ద్రావిడ్‌ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన ధోనీ.. పదేళ్ల పాటు భారతకు ఎన్నో ఘన విజయాలు అందించాడు. 2007లో ఐసీసీ వరల్డ్‌ టీ-20, 2011లో వన్డే వరల్డ్‌కప్‌, 2013లో చాంపియన్స్‌ ట్రోఫీలను మహీ నేతృత్వంలో టీమిండియా సాధించింది. కపిల్ తర్వాత భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన ధోని…పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లోనూ తనదైన ముద్రవేశాడు. అంతేగాదు టీమిండియాను 2009లో టెస్టుల్లో టాప్‌ ర్యాంకులో నిలబెట్టాడు. ధోనీ నాయకత్వంలో భారత 199 వన్డేలు ఆడితే.. 110 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 72 టీ-20ల్లో 41 నెగ్గి.. 28 మ్యాచ్‌ల్లో ఓడింది.

Dhoni Steps Down As Captain Of India ODI And T20I Teams

() 283 వన్డేలాడిన ధోని.. 9110 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 61 అర్ధసెంచరీలు ఉన్నాయి. 73 టీ20 మ్యాచ్‌లు ఆడిన మహి 1112 పరుగులు సాధించాడు. వికెట్‌ కీపర్‌గా వన్డేల్లో 267 క్యాచ్‌లు, 92 స్టంపింగ్‌లు, టీ20ల్లో 41 క్యాచ్‌లు, 22 స్టంపింగ్‌లు ధోని ఖాతాలో ఉన్నాయి.
() ధోని సారథ్యంలో భారత్‌ 2015 ప్రపంచకప్‌, 2016 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది.
()ఐపీఎల్‌లో కూడా ధోని మెరుపులు మెరిపించాడు. అతను నేతృత్వం వహించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు రెండు సార్లు టైటిల్‌ గెలుచుకుంది. రెండుసార్లు ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 కప్‌ను కూడా గెలుచుకుంది.

Dhoni Steps Down As Captain Of India ODI And T20I Teams
()ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును రెండు సార్లు గెలుచుకున్న వ్యక్తిగా ధోని రికార్డు సృష్టించారు.
()భారత ప్రభుత్వం 2007లో రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న అవార్డు, 2009లో పద్మశ్రీ పురస్కారంతో ధోనిని సత్కరించింది.
() లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాతో భారత ఆర్మీ ధోనీని గౌరవించింది.

Dhoni Steps Down As Captain Of India ODI And T20I Teams

ధోనీ అనూహ్య నిర్ణయంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ధోని నిర్ణయంపై నిరాశ ఉన్న ప్రముఖ క్రికెట్లు మహిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌గా ధోనిని కొనియాడుతున్నారు. ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా ధోనీపై కామెంట్ల వర్షం కురిపించారు. ధోనీ లాంటి కెప్టెన్ మరొకరు లేరంటూ ప్రశంసలు కురిపించారు. ధోనీ ఫొటోలు పెట్టి అభిమానం చాటుకున్నారు.