బాబాయ్‌ యాత్రకు అబ్బాయ్‌ మద్దతు..

244
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో చేపట్టిన యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈయాత్రలో భాగంగా.. తన రాజకీయాలకు, చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని నిన్న పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన రాజకీయ జీవితానికి కుటుంబ సభ్యుల మద్దతు లేదని కూడా పవన్ తెలిపారు. ఆయన ప్రకటించిన కాసేపటికే సోషల్ మీడియా ద్వారా మెగా ఫ్యామిలీ నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. మొదట ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ్ తన బాబాయ్ (పవన్ కల్యాణ్) కి శుభాకాంక్షలు చెబుతూ తన మద్దతు తెలిపారు.

Ram Charan Conveys Wishes to Pawan

నేను ఓ భారతీయుడ్ని.. నా జన్మభూమి రక్షించుకునే బాధ్యత నాపై ఉందంటూ పవర్ ఫుల్ కామెంట్ తో పవన్ చేస్తున్న ఈ యాత్ర సక్సెస్ కావాలని తాను కోరుకుంటున్నానని.. బాబాయ్ మీకంతా శుభం జరగాలని తాను కోరుకుంటున్నట్లుగా చరణ్‌ వెల్లడించారు. పవన్ ఫోటో పెట్టి రాంచరణ్ పెట్టిన పోస్ట్ కి మెగా అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగా క్యాంప్ కు చెందిన మరో హీరో.. పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ సైతం రియాక్ట్ అయ్యారు. మీ వెంటే మేం అంటూ పవన్ ఫోటోను జత చేసి ట్వీట్ చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు పవన్ తెలంగాణలో చేపట్టిన తెలంగాణ యాత్రకు ముందు.. ఏపీలో పలు జిల్లాల్ని పర్యటించిన సందర్భంగా ఎలాంటి కామెంట్లు చేయని మెగా క్యాంప్ హీరోలు.. తాజాగా తెలంగాణలో షురూ చేసిన యాత్రపై సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఏమైనా తెలంగాణలో పవన్ చేపట్టిన యాత్రకు మెగా ఫ్యామిలీ నుంచి అనూహ్య మద్దతు లభించటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Ram Charan Conveys Wishes to Pawan

- Advertisement -