తెలుగు ‘క్వీన్‌’లో తమన్నా లుక్‌..!

229

గతంలో కంగనా రనౌత్ నటించిన హిందీ హిట్ చిత్రం ‘క్వీన్’ను తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోకి ఈ చిత్రాన్ని ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. కాగా, తెలుగు వెర్షన్ కి ‘దటీజ్ మహాలక్ష్మి’ టైటిల్ ను ఖరారు చేశారు.

Tamanna

ఈ విషయాన్ని టైటిల్ రోల్ పోషిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పింది. గతంలో విడుదలైన ‘100% లవ్ చిత్రం’లో మహాలక్ష్మి పాత్రలో తాను నటించిన విషయాన్ని గుర్తుచేసుకుంది. ఇప్పుడు, ఇదే పేరును ఈ చిత్రానికి పెట్టడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఈ మూవీ ష్యూటింగ్‌ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది.

Tamanna

‘క్వీన్‌’ తెలుగు వెర్షన్‌కి సంబందించిన తమన్న లుక్‌ బయటికి వచ్చింది. తమన్నా చీర కట్టు, కళ్లజోడుతో ఇంతకుముందు కంటే కాస్త బొద్దుగా కనిపిస్తోంది. తెలుగు ‘క్వీన్‌’లో తమన్నా లుక్‌ ఇదే అని తెలుస్తోంది. ఈమూవీ సిద్దు జొన్నలగడ్డ, జివిఎల్‌ నరసింహరావ్‌, మాస్టర్‌ సంపత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మనుకుమార్‌ నిర్మాత. కాగా, కన్నడలో పరుల్ యాదవ్, తమిళంలో కాజల్, మలయాళంలో మాంజిమా మోహన్ లు టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు.