మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం లూసిఫర్. మలయాళంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని హీరో పృథ్వీరాజ్ డైరెక్ట్ చేయడంతో కీరోల్ పోషించాడు. తాజాగా టీ టౌన్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారు. లూసిఫర్ రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు దర్శకుడు పృథ్వీరాజ్.
అయితే ఈ రీమేక్ మూవీ చిరంజీవి కోసమా లేదా ఎవరికోసం అన్నది తెలియాల్సి ఉంది. గతంలో చిరు నటించిన హిట్లర్ , ఠాగూర్ , శంకర్‌దాదా ఎంబిబిఎస్ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి. అయితే చిరు కోసమే ఈ రీమేక్ రైట్స్‌ని రాంచరణ్ దక్కించుకున్నాడని తెలుస్తోంది.
కేరళలో నిర్వహించిన సైరా ఫంక్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు. అనంతరం చిరుతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ మానవత్వం కల మంచి మనిషి చిరంజీవి . ఆయన లూసిఫర్ రీమేక్ రైట్స్ కొన్నారని తెలిసి థ్రిల్లయ్యాను అని పేర్కొన్నారు. సైరా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా, త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు చిరంజీవి.ఈ రెండు సినిమాల తర్వాత లూసిఫర్ రీమేక్ తెరకెక్కనుందా వేచిచూడాలి.