రికార్డు సృష్టించిన సైరా ప్రీ రిలీజ్ బిజినెస్

386
syeraa censor
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈమూవీపై భారీగా అంచనాలున్నాయి. సైరా ట్రైలర్ , టీజర్ కు అన్ని భాషల్లో నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలకు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో మెగా అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఇక ఈరోజు అర్ధరాత్రి నుంచి సైరా ప్రీమియర్ షోలు నడువనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈమూవీకి భారీగా క్రేజ్ ఏర్పడింది.

ఇక సైరా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అద్భుతంగా ఉంది. ఒక్క తెలుగు వర్షన్ లోనే దాదాపు రూ. 150 కోట్ల బిజినెస్ జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రూ. 108 కోట్ల బిజినెస్ జరిగింది. విదేశాల్లో తెలుగు రైట్స్ తో కలపుకుంటే ఇది రూ. 150 కోట్లకు చేరింది.

కన్నడలో కూడా సైరా మేనియా బానే ఉందని చెప్పుకోవాలి. అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ. 27కోట్లు వసూలు చేసింది. ఈమూవీలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి , నయనతార లాంటి నటీనటులు ఉండటంతో ఇతర భాషల్లో కూడా సైరాకు భారీగా క్రేజ్ ఏర్పడింది. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈసినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు.

- Advertisement -