రామ్ చ‌ర‌ణ్ మూవీ టైటిల్ ‘జ‌గ‌దేక‌వీరుడు’?

247
ram charan

రంగ‌స్ధ‌లం సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో ఇది 12వ సినిమా. యాక్ష‌న్ ఎంట‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈసినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ న‌టిస్తోంది. నిర్మాత‌గా డీవీవీ దాన‌య్య వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన ఇటివ‌లే రెండు షెడ్యూల్ ల‌ను పూర్తి చేశారు. స‌గం వ‌ర‌కూ షూటింగ్ పూర్త‌యింద‌ని తెలుస్తుంది. మ‌రికొద్ది రోజుల్లో బ్యాంకాంగ్ లో మూడ‌వ షెడ్యూల్ ను ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం.

charan, chiruఇక ఇంత‌వ‌ర‌కూ ఈసినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయ‌క‌పోవడంతో ఎలాంటి టైటిల్ పెడ‌తార‌ని మెగా అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. డైరె క్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కొద్ది రోజుల క్రితం రాజ‌వంశ‌స్దుడు అనే టైటిల్ ప‌రిశిలించిన‌ట్టు తెలుస్తుంది. ఈటైటిల్ ప‌ట్ల చిరంజివికి సంతృప్తిగా అనిపించ‌లేద‌ని మ‌రో టైటిల్ ను వెతుకుతున్న‌ట్లు స‌మాచారం. క‌థ ప్ర‌కారం చూసుకుంటే మ‌రో టైటిల్ కూడా బోయ‌పాటి ప‌రిశీలిస్తున్న‌ట్లు ఫిలీం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. జ‌గ‌దేక‌వీరుడు అనే టైటిల్ ఒకే చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ పెట్ట‌మ‌ని చిరంజీవి బోయ‌పాటికి సూచించిన‌ట్లు తెలుస్తుంది.

boyapati , charan

ఈటైటిల్ ప‌ట్ల బోయ‌పాటి కూడా ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌కుండా ఫైన‌ల్ చేశాడ‌ని స‌మ‌చారం. గ‌తంలో చిరంజీవి న‌టించిన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో మ‌నకు తెల‌సిందే. చిరంజీవి సినిమాలో మ‌రచిపోలేని సినిమాల‌లో ఒక‌టి జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి అని చెప్పుకోవ‌చ్చు. చిరంజీవికి ఇంత పెద్ద విజ‌యాన్నిచ్చిన సినిమా టైటిల్ చ‌ర‌ణ్ సినిమాకు పెడితే చ‌ర‌ణ్ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. ద‌స‌రా సెల‌వుల్లో ఈసినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలిపారు చిత్ర బృందం.