నిక్ జోనస్‌తో ప్రియాంక ప్రేమాయణం..?

348
priyanka-chopra
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ప్రేమలో పడిందనే వార్త  ఇప్పుడు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. క్వాంటికో సిరీస్‌తో ప్రియాంక అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరిస్ పుణ్యమా అంటూ ఈ బ్యూటీకి హాలీవుడ్‌లో సైతం అవకాశాలు కూడా వస్తున్నాయట. ఇక ఈ అమ్మడు ఓ యంగ్ పాప్ సింగర్‌తో ప్రేమాయణం కొనసాగిస్తుందన్న వార్త బాలీవుడ్‌లో చర్చనియాంశంగా మారింది.

Nick-Jonas-Priyanka-Chopra

ఇక అమెరికన్ పాప్‌సింగర్ అయినటువంటి నిక్ జోనస్‌తో ప్రియాంక ప్రేమలో పడిందని బాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి చట్టాపట్టాలేసుకుని దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఇదంతా నిజమేనన్నట్లుగా భావిస్తున్నాయి బాలీవుడ్ వర్గాలు.

ఇక్కడ ఇంకోక విషయం చెప్పాలి. ఈ యంగ్ నిక్ జోనస్‌ వయస్సు ప్రియాంకతో పోలిస్తే ఏకంగా పదేళ్లు చిన్నవాడవటం విశేషం. మూడు పదుల వయస్సు దాటినా ఈ అమ్మడు పాతికేళ్ల కుర్రాడితో ఏం తిరుగ్గుల్లని కొందరు విసుక్కుంటున్నారట. మరి ఇంతకు వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా.? లేదంటే ప్రేమేనా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సుందరి ప్రస్తుతం ‘క్వాంటికో’ మూడో సిరీస్‌లో నటిస్తూ సల్మాన్‌ ఖాన్‌కు జోడిగా ‘భరత్‌’లో నటిస్తోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2019 ఈద్‌ సందర్భంగా విడుదల కానుంది.

- Advertisement -