కేజీఎఫ్‌ 2లో బాలయ్య!

133
KGF-2

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కన్నడం,హిందీ, తెలుగు, త‌మిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది.

తాజాగా కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ విలన్ అధీరా పాత్ర లో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ దేశ ప్రధాని పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్‌-2 లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.అయితే దీనిపై కేజీఎఫ్‌-2లో బాలయ్య నటిస్తున్నారని చిత్ర బృందం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ గూగుల్‌ మాత్రం కేజీఎఫ్‌-2 సినిమా నటీనటుల జాబితాలో బాలయ్య పేరును చేర్చేసింది.