కొత్త లుక్స్‌ తో ఎంట్రీ ఇవ్వనున్న యంగ్‌ హీరోస్‌..!

78
Ram Charan adn ntr new looks for upcomming movies

ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలన్నీ ఆసక్తి రేకెత్తిస్తున్నవే. అందులో రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ‘ధృవ’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రామ్ చరణ్..  దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా ఎంత ఆసక్తి రేకెత్తిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా మీద దాదాపు ఏడాదిగా వర్స్‌ చేస్తున్నాడు సుకుమార్.

అయితే స్క్రిప్టు పూర్తయ్యాక ప్రి ప్రొడక్షన్ మీద కూడా చాలా శ్రద్ధ పెట్టాడు సుకుమార్‌. ఇక ఇందులో రామ్ చరణ్ ఈ సినిమా కోసం చాలానే లుక్స్‌ మార్చుకున్నాడు. మూడు నెలలుగా చరణ్‌ ఆ పని మీదే ఉన్నాడు. ఈ మధ్యే చరణ్ కు 15 రకాల లుక్స్ తో టెస్టులు చేసి.. ఒక లుక్ ఫైనలైజ్ చేశారు చిత్రటీమ్‌. ఇక దీంతో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు ఏ ఇబ్బందీ లేకపోయింది. ఇక ఈ నెల 15న చరణ్ రంగంలోకి దిగేస్తున్నాడు.
 Ram Charan adn ntr new looks for upcomming movies
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే.. బాబీ డైరెక్షన్లో ఒక వైవిధ్యమైన సినిమా చేయనున్నాడు తారక్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా లుక్ మార్చుకోవాల్సి వచ్చింది. గత నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయినప్పటికీ.. ఎన్టీఆర్ మాత్రం ఇంకా లుక్ మార్చుకునే పనిలోనే ఉన్నాడు. ఓ హాలీవుడ్ నిపుణుడు ఈ సినిమాకు మేకప్ పర్యవేక్షకుడిగా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడి సూచనల ప్రకారం ఎన్టీఆర్ లుక్ మార్చుకున్నాడు. ఈ నెల 9న ఎన్టీఆర్ సెట్లోకి అడుగుపెడుతున్నాడు. ప్రస్తుతం కొంచెం నెమ్మదిగా సాగుతున్న షూటింగ్ ఆ రోజు నుంచి ఊపందుకుంటుంది.