చివరికి వెంకీ కూడా అదే లిస్టులో..!

209
Venkatesh sang a special song for Guru Movie
- Advertisement -

సింగర్సే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న హారోయిన్స్‌, హీరోలు కూడా వారి వారి సినిమాల్లో పాటలు పాడడం మామూలైపోంది. ఇప్పుడు ఇదే లిస్ట్‌ లో వెంకీ కూడా చేరిపోయాడు. విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం ‘గురు’ సినిమాలో బిజీగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.

 Venkatesh sang a special song for Guru Movie

అయితే ఈ సినిమా కోసం వెంకీ తనలో ఉన్న మరో టాలెంట్‌ ని బయటపెట్టేశాడు. అందరి హీరోల్లాగే వెంకటేష్ కూడా పాట పాడటం స్టార్ట్‌ చేశాడు.  ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘గురు’ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సినిమాలో బాక్సింగ్‌ కోచ్‌గా నటిస్తున్న వెంకటేష్‌ ఓ పాట పాడారు. ఈ పాటకి సంతోష్‌ నారాయణ సంగీతం అందించారు.

  ఎన్నో విభిన్న పాత్రలతో మెప్పించిన వెంకటేష్‌ ‘గురు’ కోసం తొలిసారి పాట పాడటం విశేషం. ఈ సినిమాలో రితికా సింగ్‌ మరో ప్రధాన పాత్ర పోషించింది.ఇక ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయనున్నారు.

- Advertisement -