ఫిట్‌నెస్‌ గోల్స్‌తో రకుల్ సవాల్..

296
- Advertisement -

హీరోహీరోయిన్లు ఫిట్‌గా ఉండేందుకు ప్రతిరోజు జిమ్ చేస్తుంటారు. పర్సనాలిటీ పాటు అందాన్ని కాపాడుకునేందుకు నానా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే.. రకుల్ ప్రీత్ సింగ్ తన ఫిట్‌నెస్ గోల్స్‌తో పలువురికి సవాల్ విసురుతోంది. తాజాగా రకుల్ జిమ్ చేస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇనుప కడ్డీలపై ఆమె నిలబడి కసరత్తు చేస్తుడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ వీడియోలో 40 కిలోల బరువును నడుముకు కట్టుకుని స్క్వాట్స్ చేస్తూ కనిపిస్తోంది. మెడ నొప్పిగా ఉంది.. ఇలా చేస్తే ఆ నొప్పి కాస్త తగ్గుతుంది. 40 కిలోల బరువుతో స్క్వాట్స్ చేశానని వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది రకుల్. ప్రస్తుతం సూర్యకు జంటగా “ఎన్జీకే” అనే సినిమాలో నటిస్తూ.. శివ కార్తికేయన్ సరసన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది రకుల్ ప్రీత్ సింగ్.

- Advertisement -