టీఆర్‌ఎస్ లో చేరిన కాంగ్రెస్‌ నేతలు..

210
KTR
- Advertisement -

ఐటీ పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌ సమక్షంలో నేడు కామారెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నర్సింగరావు, మాచారెడ్డి, మామిండ్ల అంజయ్య లకు గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్‌.

KTR

అనంతరం ప్రసంగించిన కేటీఆర్‌..కాంగ్రెస్‌ పార్టీ పై విమర్శలు గుప్పించారు. ప్రగతినివేదన సభలో కాంగ్రెస్‌ నేతలను తిట్టినందుకు వాళ్ళు బాధపడుతున్నారని, తెలంగాణ సమాజం మొత్తం టీఆర్‌ఎస్‌ వెంటే ఉందని వెల్లడించారు. ప్రగతి నివేదన సభకి లక్షలాదిగా తరలివచ్చారని, నాలుగేళ్ళలో జరిగిన అభివృద్ధిని వివరించేందుకే ప్రగతి నివేదన సభ పెట్టామని తెలిపారు.

రాహుల్‌గాంధీ సొంత నియోజకవర్గం అమేథీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓడిపోయిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎప్పుడు ఉప ఎన్నికల వచ్చినా టీఆర్ఎస్‌ ఘనవిజయం సాధించిందని, అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటామని గుర్తుచేశారు. కాగా..నారాయణఖేడ్‌, పాలేరు కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచిందంటే..ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గంప గోవర్దన్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తోపాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

- Advertisement -