కరోనా నుండి కోలుకున్న రకుల్!

55
rakul

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా నుండి కోలుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన రకుల్..హాయ్ ఫ్రెండ్స్ నాకు క‌రోనా నెగెటివ్ వ‌చ్చింది. క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ‌, ఆద‌ర‌ణ‌కు ధ‌న్య‌వాదాలు అని పేర్కొంది.

2021ను పాజిటివ్ దృక్ప‌థంతో మొద‌లు పెట్టాల‌ని అనుకుంటున్నాను. ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌గా ఉండి మాస్క్‌లు ధ‌రిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాల‌ని కోరింది. కరోనా నుండి బయటపడటానికి అనేక రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ చక్కటి పౌష్టికాహారం తీసుకుంటున్నా. వీటికి అనుబంధంగా విటమిన్‌ మాత్రలు కూడా వేసుకుంటున్నా అని పేర్కొంది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది రకుల్.