నా డైరీలో ఆ మాటే లేదు: హన్సిక

50
hansika

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న బ్యూటీ హన్సిక మోత్వాని. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించిన హన్సిక ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తు మెప్పిస్తోంది.

అయితే తాజాగా పెళ్లి వార్తలపై స్పందించింది ఈ ముద్దుగుమ్మ. తన డైరీలో పెళ్లన్న మాటకు కూడా తావులేదని తెగేసి చెప్పింది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ లాక్‌డౌన్ టైంలో వర్కౌట్లు చేసీ స్లిమ్‌గా తయారై మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

దేశముదురు సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన హన్సిక కొన్ని సినిమాలు చేసినా అనుకున్నంతగా రాణించలేక పోయింది. కానీ ప్రస్తుతం తమిళ నాట స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది.