ములుగులో సఖీ కేంద్రానికి శంకుస్థాపన..

36
sathyavathi

ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు మంత్రి సత్యవతి రాథోడ్.రూ. 49 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సఖీ కేంద్రానికి శంకుస్ధాపన చేశారు.

అనంత‌రం రూ. 27.5 లక్షల వ్య‌యంతో నిర్మించిన గిరి బ్రాండ్ శానిటరీ నాప్కిన్స్ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హన్మంతు జండగే, ఎస్పీ సంగ్రామ్ సింగ్, స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.