నాగ్‌కి జోడీగా నాగచైతన్య హీరోయిన్‌..!

243
Rakul Preet Singh
- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్‌ తన అందం, అభినయంతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. అయితే ఈ అమ్మడికి గత కొంతకాలంగా పెద్దగా హిట్స్‌ లేవు. దానికి తోడు కోలీవుడ్.. బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టడంతో తెలుగులో అవకాశాలు తగ్గుతూవస్తున్నాయి. ఇటీవల నాగచైతన్య,వెంకీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వెంకీమామ’లో హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్సయింది. ఈ నేపథ్యంలో రకుల్‌కు మరో భారీ ఆఫర్‌ వచ్చినట్టు తెలుస్తోంది.

Rakul Preet Singh

కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం రకుల్‌ని సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా చలాకీగా .. బిందాస్‌గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. కొత్తగా డిజైన్ చేసిన ఈ పాత్ర తనకి మరింత క్రేజ్ తీసుకొస్తుందనే గట్టి నమ్మకంతో రకుల్ ఉందని అంటున్నారు. ఈ నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

- Advertisement -