ఈ స‌మ్మ‌ర్‌లో కూల్ సినిమా అవుతుంది-నాని

266
HIPPI movie Teaser
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా `హిప్పీ` టీజ‌ర్ విడుద‌లైంది. `RX 100` ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టించిన చిత్ర‌మిది. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాత‌గా, టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందుతోంది.

ఈ చిత్రం టీజ‌ర్‌ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ “కార్తికేయ‌తో క‌లిసి `గ్యాంగ్ లీడ‌ర్‌`లో ప‌నిచేస్తున్నాను. `ఆర్ ఎక్స్ 100` గురించి ఇంత‌కు ముందు చాలా విన్నాను. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో తెలిసిందే. కార్తికేయ చాలా బాగా చేశాడ‌ని అంద‌రూ మెచ్చుకున్నారు. ఇప్పుడు అత‌నితో క‌లిసి ప‌నిచేస్తుంటే… ఆ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయి ఉంటుందో అర్థ‌మైంది. కార్తికేయ‌తో ప‌నిచేయ‌డం చాలా స‌ర‌దాగా ఉంది. ఈ ప‌రిచ‌యంతోనే నేను `హిప్పీ` టీజ‌ర్‌ విడుద‌ల చేశాను. `హిప్పీ` టీజ‌ర్‌ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. చాలా బావుంది. స‌క్సెస్‌ఫుల్ సినిమాకు ఉండే అన్నీ ల‌క్ష‌ణాలు, వైబ్రేష‌న్స్ ఇందులో ఉన్నాయి. సినిమా చాలా బావుంటుంద‌నిపిస్తోంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ స‌మ్మ‌ర్‌లో త‌ప్ప‌కుండా కూల్ సినిమా అవుతుంది. సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుందని న‌మ్ముతున్నా“ అని అన్నారు.

HIPPI movie Teaser

కార్తికేయ మాట్లాడుతూ “నాని సార్‌తో ప‌నిచేసే ఛాన్స్ నాకు `గ్యాంగ్‌లీడ‌ర్‌` చిత్రంతో వ‌చ్చింది. దాన్నుంచి అడ్వాంటేజ్ తీసుకుని, టీజ‌ర్ లాంచ్ ఆయ‌న చేతుల మీదుగా జ‌రిపించాల‌ని అనుకున్నా. నేను అడ‌గ్గానే అంగీక‌రించారు. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. `నేను అడ్వాంటేజ్ తీసుకోవ‌ట్లేదు క‌దా సార్‌` అని అన్నా. `నువ్వు అడ‌క్క‌పోయినా చేసేవాడిని` అని నాని సార్ అన్నారు. అంత మంచి వ్య‌క్తి ఆయ‌న. షూటింగ్ చేస్తున్న‌ప్పుడే ఆయ‌న బాగా క్లోజ్ అయ్యారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చాక `నాకు ఇంకా ఏ పెద్ద హీరో తెలియ‌దు` అని అనుకుంటున్న త‌రుణంలో నానితో ఈ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఆయ‌న‌తో స్నేహ‌పూర్వ‌కంగా ఉండ‌గ‌లుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో ఈ జ‌ర్నీ కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నా“ అని అన్నారు.

- Advertisement -