కరోనా బాధితులకు అండగా రకుల్!

57
rakul

కరోనా బాధితులకు అండగా నిలిచారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఓ వైపు కరోనా మరోవైపు ఆక్సిజన్ అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముందుకొచ్చారు రకుల్.

కరోనా రోగులకు ఆక్సిజన్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం తన వంతుగా కొంత సొమ్ము సమకూర్చిన రకుల్‌… తన స్నేహితులు ద్వారా మరికొంత మొత్తాన్ని సేకరించి ఆ నిధులతో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవలె కరోనా బారీన పడ్డ రకుల్…హోం ఐసోలేషన్‌లో ఉంటూ ఈ మహమ్మారిని జయించారు. ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌గా ఉండి మాస్క్‌లు ధ‌రిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాల‌ని కోరారు.