బాధితుల్లో ధైర్యాన్నినింపండి:ఎమ్మెల్యే చిరుమర్తితో కేటీఆర్

43
ktr

కరోనా బాధితుల్లో ధైర్యాన్ని నింపాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సూచించారు మంత్రి కేటీఆర్. నకిరేకల్‌లో కరోనా కేసులపై ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన కేటీఆర్‌..కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ ఏ విధంగా సాగుతోందని అడిగి తెలుసుకున్నారు. బాధితుల్లో మనోధైర్యాన్ని నింపాలని,మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఆదేశించారు.

నకిరేకల్‌ మున్సిపాలిటిలోని 1,2,5,6,17,20 వార్డులలో పర్యటించారు ఎమ్మెల్యే లింగయ్య. కరోనా బారిన పడి మృతి చెందిన 15 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.1.50లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కరోనా వచ్చిందని అధైర్యపడకుండా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.