గాలి వారి పెళ్లిలో అదరగొట్టిన రకుల్‌..

473
Rakul preet singh dance at gali janardhan daughter marriage
Rakul preet singh dance at gali janardhan daughter marriage
- Advertisement -

గాలి వారి పెళ్లి అంటే ఎలా ఉంటుందో… మరోసారి రుజువువైంది. కూతురు వివాహాన్ని అంగరంగవైభవంగా జరిపించిన మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌ రెడ్డి… ప్రతి ఒక్క విషయంలో తన రేంజ్‌లో ఏంటో తెలియజేస్తున్నాడు. ఇప్పటికే వెడ్డింగ్ కార్డుతో అందరినీ ఆశ్చర్యన గాలి జనార్ధన్ కూతురు వివాహం వేడుకకి సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. సినిమా సెట్‌కు తగ్గకుండా కళ్యాణ్ మండపాన్ని వేసి అందులో తన కూతురి వివాహాన్ని జరిపించాడు.

gali janardhan daughter marriage
gali janardhan daughter marriage

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుండి పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించిన ఈ మైనింగ్ డాన్ కొందరితో స్టెప్పులేయించాడు. ఇపుడు ఫుల్ ఫాంలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళిలో తన డ్యాన్స్ తో అందరిని అలరించింది. అయితే ఈ పెళ్ళి వేడుకలో లైవ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చినందుకు గాను గాలి జనార్దన్ రెడ్డి రకుల్ కి బాగానే ముట్ట జెప్పాడని తెలుస్తోంది. ఈ భామకు ఒక్క షోకి గాను 20 లక్షలు ముట్టాయని టాక్. సౌత్ మొత్తంతో పాటు నార్త్ లోనూ క్రేజ్ ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకి.. డ్యాన్స్ చేసేందుకు 70 లక్షల రూపాయలు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దకిరి మాత్రమే కాదు.. ప్రియమణి.. కేథరిన్.. శాన్వి.. లాంటి ఇతర భామలకు కూడా భారీగానే ముట్టచెప్పి పట్టుకొచ్చినట్లు టాక్. నిమిషాల పాటు ఉండే ఈ ప్రదర్శనకు పిలిచిన హీరోయిన్లతో పాటు వారి మేనేజర్లకు కూడా స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఇక జబర్దస్త్ కామెడీ టీం వేసిన స్కిట్స్ కూడా ఆహుతులను బాగానే అలరించాయి.

మరి కొందరు నటీనటులు కూడా ఇక్కడ తమ పర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించగా, సింగర్స్ తమ పాటలతో సంగీత ప్రియులని అలరించారు. హాస్య నటులు అదే వేదికపై కామెడీ స్కిట్స్ చేసి వీక్షకులను కడుపుబ్బ నవ్వించారు. గాలి జనార్ధన్ కూతురి వివాహ వేడుకకు ఇండస్ట్రీ నుండి బ్రహ్మానందం, సుమన్, సాయికుమార్, విశాల్, తమన్నా ప్రదీప్ తదితర నటీనటులు హాజరయ్యారు.

- Advertisement -