రకుల్ @ డాక్టర్ ఫాతిమా

178
rakul
- Advertisement -

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్‌లో డాక్టర్ జీ అనే సినిమాలో డాక్టర్ ఫాతిమాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె న్యూ లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. న్యూ లుక్‌లో అదరగొట్టింది రకుల్.ఈ సినిమాను జంగ్లీ పిక్చర్ నిర్మిస్తుండగా, అనుభుతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం రకుల్ నటించిన కొండపొలం విడుదలకు సిద్ధంగా ఉండగా బాలీవుడ్‌లో ‘థ్యాంక్‌గాడ్‌’, ‘సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌సన్‌’, ‘మేడే’, ‘ఎటాక్‌’ సినిమాల్లో నటిస్తున్నారు రకుల్.

- Advertisement -