సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

26
kcr cm

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు వనపర్తి జిల్లా గౌడ సంఘం నాయకులు. వైన్ షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వనపర్తి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీలతో పాటు గౌడ కులస్థులు, ఎస్టీలకు కూడా రిజర్వేషన్‌ కల్పిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది.