కోహ్లీ వారసుడు అతడే: సునీల్ గవాస్కర్

63
gavaskar

యూఏఈ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 తర్వాత కోహ్లీ తన కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఈ విషయం పై స్పందించారు. భారత కొత్త కెప్టెన్ గా ఓపెనర్ కేఎల్ రాహుల్ కనిపిస్తున్నారని జోస్యం చెప్పాడు.

రోహిత్ శర్మను కెప్టెన్ ను చేయాలనీ బీసీసీఐ చూస్తుందని.. కాబట్టి టీం ఇండియా వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ని నియమించాలని సూచించాడు. 34 ఏళ్ళ రోహిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇప్పుడు అప్పగించిన బీసీసీఐ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని తెలిపాడు.

వాస్తవానికి కోహ్లీ మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నా కొంతకాలంగా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐపై ఒత్తిడి వస్తుండటంతో కోహ్లీనే దీనిపై స్పందించి ప్రపంచకప్ తర్వాత తాను తప్పుకుంటానని తెలిపారు.