డ్రగ్స్‌ కేసు.. ఈడీ విచారణకు రకుల్‌..

27

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రముఖులను సుదీర్ఘంగా విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా నేడు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. అయితే నిజానికి ఈనెల 6న విచారణకు హాజరుకావాలని రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తేదీని మార్చాలంటూ ఈడీ అధికారులకు రకుల్‌ లేఖరాశారు.

ఆ లేఖను పరిశీలించిన అధికారులు.. తొలుత ఆమె అభ్యర్థనను తిరస్కరించినా.. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు. గతంలో సిట్‌ అధికారులు విచారించిన సినీ ప్రముఖల జాబితాలో రకుల్‌ పేరు లేదు. కెల్విన్‌కు ఆమె నగదు పంపించినట్లుగా ఈడీ ఆధారాలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల ప్రకారమే నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం.

నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పుడు దీనిపై విచారణ జరిపిన ఎక్సైజ్ శాఖ.. కేసుతో సంబంధం ఉన్న ప్రముఖులను సుదీర్ఘంగా విచారించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసును ఈడీ టేకప్ చేసింది. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ చట్టం కింద 12 మంది సెలెబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. వీరిలో ఆగస్టు 31న పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2న చార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు శ్రీనివాస్, 13న నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది.