తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు..

140
rains
- Advertisement -

తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని, రేపు (శనివారం) భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

ఇక నిన్న హైదరాబాద్‌లో రాత్రి ఏడున్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వానకు జనజీవనం స్తంభించి పోయింది. మూడు గంటల్లోనే ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి (కె)లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

- Advertisement -