సచిన్‌ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లి..

215
kohli
- Advertisement -

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి .. అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని క్రాస్‌ చేశాడు. అండర్సన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించిన రన్‌ మెషీన్‌ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్​లో వేగంగా 23,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్​మెన్​గా రికార్డుల్లోకెక్కాడు.

ఈ ఇన్నింగ్స్ తో కోహ్లి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా అవతరించాడు. సచిన్‌కు ఈ ఘనత నమోదు చేసే క్రమంలో 522 ఇన్నింగ్స్ లు ఆడగా, కోహ్లి 490 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డు నెలకొల్పాడు. ఇందులో 70 శతకాలు, 116 అర్ధ శతకాలు బాదాడు.

ఇక ఫీట్‌ను పూర్తి చేయడానికి ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికి పాంటింగ్‌కు 544 ఇన్నింగ్స్ అవసరం కాగా, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌ 551 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. వీరి తర్వాత శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(568 ఇన్నింగ్స్‌), ద వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌(576), శ్రీలం​క మాజీ కెప్టెన్‌ జయవర్ధనే(645) వరుసగా ఈ మార్కును క్రాస్‌ చేశారు.

- Advertisement -