మూడు నెల‌లు మీ ఇంట్లోనే ఉంటా ఆశీర్వ‌దించండి…

275
bigboss2 nani

న్యాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ 2 లో హోస్ట్ గా చేయ‌నున్నాడ‌నే విష‌మం తెలిసిందే. ఈషో ను జూన్ 10 తేది నుంచి ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఈషోకు సంబంధించి ప‌లు ప్రోమోలు కూడా విడుద‌లయ్యాయి. బిగ్ బాస్ 1 కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో బిస్ బాస్ 2 ను నిర్వ‌హ‌స్తున్నారు. అయితే ఈషోకు సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు హీరో నాని, బిగ్ బాస్ టీం. ఈసంద‌ర్భంగా నాని మాట్లాడుతూ… వ‌చ్చే మూడున్న‌ర నెల‌ల కాలం తానూ తెలుగువారి ఇళ్ల‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాన‌ని తెలిపారు. తెలుగు ప్రేక్ష‌కుల‌ను రోజు క‌లుసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు.

nani

మ‌రో వారం రోజుల్లో ఈ షోను ప్రారంభించ‌డంతో ప‌లు ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాల్లో ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. ఈ కార్యాక్ర‌మానికి హోస్ట్ గా చేస్తుంన్నందుకు చాలా ఆనందంగా ఉంద‌న్నారు. తాను మీ ఇంట్లో ఒక‌డిగా మి ముందుకు రాబోతున్నాన‌ని తెల‌పారు. యాంక‌ర్ గా త‌న తొలి ప్ర‌య‌త్నాన్ని తెలుగు ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దించాల‌ని కోరారు. ఎన్ని సినిమాలు చేసినా త‌నకు చాల‌డం లేద‌ని త‌న దాహాన్ని బిగ్ బాస్ ద్వారా తీర్చుకుంటాన‌ని న‌మ్ముతున్నాని అన్నారు. సినిమా షూటింగ్ క‌న్నా బిగ్ బాస్ నిర్వాహ‌కులు మరింత ఆర్గనైజ్డ్ గా ఉన్నారని చెప్పాడు.

nani

ఇక ఈషోకు  వ‌చ్చె కంటెస్టెంట్ ల గురించి ప్ర‌స్తావించ‌గా..వారి గురించి త‌న‌కు అస్స‌లు తెలియ‌ద‌న్నారు. ఎవ‌రెవ‌రూ వ‌స్తున్నారో బిగ్ బాస్ టీం త‌న‌కు కూడా చెప్ప‌డం లేద‌ని..డైరెక్ట్ గా జూన్ 10 రోజున తెలుసుకుందాం అన్నారు. ఈషో లో పాల్గోనే కంటెస్టెంట్ లు ఎవ‌రో తెలుసుకోవాల‌ని నాకు కూడా ఆస‌క్తి గానే ఉంద‌న్నారు. అయితే నాని ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాలు మాత్రం మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. బిగ్ బాస్ 2 త‌ర్వాత నాని షూటింగ్ పాల్గోంటాడ‌నే స‌మాచారం . నేను చేస్తున్న సినిమాల‌ను ఎలా అయితే ఆద‌రిస్తున్నారో ఈ బిగ్ బాస్ 2 ను కూడా విజ‌యవంతం చేయాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బిగ్ బాస్ టీం తో పాటు ప‌లువురు మీడియా ప్ర‌తినిధులు, ప్ర‌ముఖులు పాల్గోన్నారు.