ప్రగతిభవన్‌లో రాఖి సెలబ్రేషన్స్‌

132
kcr
- Advertisement -

హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు జరిగాయి. సీఎం కేసీఆర్ తన సోదరీమణులచే రాఖీ కట్టించుకున్నారు. కేసీఆర్ కు స్వయానా అక్కా చెల్లెళ్లు అయిన లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ ముగ్గురు కలసి కేసీఆర్ కు హారతి పట్టి రాఖీలు కట్టారు. మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు.

కేటీఆర్ తనయుడు హిమాన్షుకు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ప్రేమగా మిఠాయి తినిపించింది. తండ్రి అభినందనలతో ప్రేమగా తండ్రి కేటీఆర్ కు కూడా అలేఖ్య రాఖీ కట్టింది. ముసిముసి నవ్వులతో కేటీఆర్ తన కుమార్తెతో రాఖీ కట్టించుకున్నారు. దీంతో ప్రగతి భవన్ లో సందడి వాతావరణం నెలకొంది.

- Advertisement -