హరీష్ రావు నివాసంలో రాఖీ సెలబ్రేషన్స్‌

44
- Advertisement -

మంత్రి హరీష్ రావు నివాసంలో రాఖీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు మంత్రికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా అక్కచెల్లెళ్ళకు పండుగ శుభాకాంక్షలు తెలిపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు తోడుగా ఉంటుందని వారి భద్రత, రక్షణ, సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు.

- Advertisement -