పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు రాకేష్ టికాయత్. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన నేపథ్యంలో స్పందించిన ఆయన… తమ పోరాటం ఇప్పుడే ఆపేయమని ..పార్లమెంట్ లో సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగు తుందని తేల్చిచెప్పారు.
కనీస మద్దతు ధర గురించి ప్రభుత్వం రైతులతో చర్చించాలని డిమండ్ చేశారు.
ఆందోళనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులు, గిరిజనలు, కార్మికులు, మహిళలకు ఈ విజయం అంకితం ఇచ్చారు. సాయంత్రం సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జరుగుతుంది…తదుపరి ఏం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఇతర సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు జరుగుతుందన్నారు.
ఇక మోడీ ప్రకటన రైతుల విజయమని పలు రాష్ట్రాల సీఎంలు వెల్లడించారు. రైతులకు సెల్యూట్ చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు,నిరంజన్ రెడ్డి సైతం రైతుల పోరాటల ఫలితంగా కేంద్రం దిగొచ్చిందని వెల్లడించారు.