విదేశీ నిధుల నియంత్ర సవరణ బిల్లు ఎఫ్‌సీఆర్‌ఏకు రాజ్యసభ అమోదం తెలిపింది. రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్… విదేశీ నిధులను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ కొత్త చట్టం తీసుకు వస్తున్నట్లు తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ భద్రతకు ఎఫ్‌సీఆర్ఏ బిల్లు పనిచేస్తుందని తెలిపారు. ఎఫ్‌సీఆర్ఏ చట్టాన్ని 2010లో తీసుకువచ్చారని, అప్పుడు కేంద్ర హోంమంత్రిగా చిదంబరం ఉన్నారని, సుమారు 20 వేల కోట్లు విదేశీ నిధుల రూపంలో వచ్చాయని చెప్పినట్లు మంత్రి రాయ్ గుర్తు చేశారు.
భారత దేశ రాజకీయ సామాజిక స్థితిగతులపై విదేశీ నిధుల ప్రభావం పడకుండా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. విదేశీ నిధులు తీసుకునే అనేక సంస్థలు తమ ఐడెంటీని దాచిపెట్టినట్లు మంత్రి తెలిపారు. అందుకే ఆధార్ కార్డును తీసుకువచ్చినట్లు చెప్పారు. లోక్‌సభలో ఎఫ్‌సీఆర్ఏ బిల్లును సెప్టెంబర్ 21వ తేదీనే పాస్ అయిన సంగతి తెలిసిందే.