56 లక్షలు దాటిన కరోనా కేసులు..

132
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా ఇప్పటివరకు కేసుల సంఖ్య 56 లక్షల మార్క్‌ను దాటేసింది. గత 24 గంటల్లో దేశంలో 83,347 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1085 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు దేశంలో 56,46,011 కరోనా కేసులు నమోదుకాగా 90,020 మంది మృతిచెందారు. కరోనా మహమ్మారి నుండి 45,87,614 మంది కోలుకోగా ప్రస్తుతం దేశంలో 9,68,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో 9,53,683 శాంపిల్స్‌ టెస్టు చేయగా ఇప్పటివరకు 6,62,79,462 టెస్టులు చేశామని ఐసీఎంఆర్‌ వెల్లడించింది.