రిలయన్స్‌లో మరోసారి కేకేఆర్ పెట్టుబడులు!

128
kkr

బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్ధలోకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టిన కేకేఆర్ తాజాగా మరోసారి భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.

త్వరలో రిల‌య‌న్స్‌లో రూ.5550 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది కేకేఆర్. ఇప్పటికే రూ. 11367 కోట్లు ఇన్వెస్ట్ చేసిన కేకేఆర్ తాజా పెట్టుబడితో 1.28 శాతం వాటాను సొంతం చేసుకుంది. ల‌య‌న్స్ రిటేల్ వెంచ‌ర్స్‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు కేకేఆర్‌కు స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు ముఖేష్‌ అంబానీ తెలిపారు.

రిల‌య‌న్స్ రిటేల్ సంస్థ‌కు ఇటీవ‌ల కాలంలో ఇది రెండ‌వ అతిపెద్డ డీల్ కావ‌డం విశేషం. ఈ పెట్టుబ‌డితో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ సంస్థ విలువ 4.21 ల‌క్ష‌ల కోట్లకు చేరుకుంది.