రాజు యాదవ్‌..ఫీల్ మై స్మైల్ సాంగ్

20
- Advertisement -

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.

తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ‘రాజు యాదవ్‌’ నుంచి ఫీల్ మై స్మైల్ సాంగ్ ని లాంచ్ చేసిన యూనిట్ కి అభినందనలు తెలిపారు.స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని ఫీల్ గుడ్ మెలోడీ నెంబర్ గా కంపోజ్ చేశారు. కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. యశస్వి కొండేపూడి తన లవ్లీ వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. రాజు యాదవ్.. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో అలరించనుంది. సాయిరామ్ ఉదయ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్.

- Advertisement -