కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు..

9
- Advertisement -

గతంలో తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక హత్యా రాజకీయాలు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వనపర్తి జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి దారుణహత్యకు గురయ్యారు.

బీఆర్ఎస్ నాయకులపై.. కాంగ్రెస్ నాయకులు వరుసగా అరాచకాలు, దాడులు చేస్తన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. శ్రీధర్ రెడ్డి హత్యను ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Also Read:ధీరజ్ మొగిలినేని..”భజే వాయు వేగం”

- Advertisement -