హ్యాపీ బర్త్ డే మామా…

347
Raju Gari Gadhi 2 First Look Motion Poster
- Advertisement -

అక్కినేని నాగార్జున ప్ర‌ధాన పాత్రలో ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ‘రాజుగారి గ‌ది-2’. నాగ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్   సినిమా ఫ‌స్ట్‌లుక్‌ మోష‌న్ పిక్చ‌ర్ ఈ రోజు విడుద‌లైంది. నాగ్‌కు కాబోయే కోడలు, హీరోయిన్ సమంత ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

ఆయన రాజే ఎందుకంటే.. తనను తాను ఎలా మలుచుకోవాలో ఆయనకు తెలుసు. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది నా మామ గొప్పగా తయారవుతున్నారు అని ట్వీట్‌ చేశారు. దీనికి నాగ్‌ ప్రతిస్పందించారు. ధన్యవాదాలు ప్రియమైన కోడల.. యు ఆర్‌ ది బెస్ట్‌ అని ట్వీట్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌లో నాగ్‌ చేతిలో రుద్రాక్షమాలను పట్టుకుని, చాలా యంగ్‌గా కనిపించారని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంద‌ని పేర్కొంది. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో ఈ సినిమాను చూద్దామ‌ని అభిమానులకు తెలిపింది. సమంత ట్వీట్‌కు స్పందించిన నాగ్ థాంక్యూ కోడలా అంటూ ట్వీట్ చేశారు.

ఓంకార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత, సీరత్‌కపూర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు.

- Advertisement -