- Advertisement -
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి ఛైర్మన్గా అరుంధతీ భట్టాచార్య విధులను నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె స్థానంలో రజనీశ్ కుమార్ రాబోతున్నారు. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుత ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య పదవీకాలం ఈ వారాంతంతో ముగుస్తుండడంతో రజనీశ్ను కొత్త ఛైర్మన్గా ఎన్నుకున్నారు.
నిజానికి అరుంధతి పదవీకాలం గతేడాదే ముగిసింది. కానీ.. ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీన నేపథ్యంలో ఆమె పదవిని ఏడాది పాటు పొడిగించారు. కాగా… అక్టోబర్ 7, 2013లో ఎస్బీఐ తొలి మహిళ చైర్మన్గా భట్టాచార్య ఎంపికైన విషయం తెలిసిందే.
ఇక ఇదిలాఉండగా..1980లో ఎస్బీఐలో ఉద్యోగిగా చేరి ఆ సంస్థలో పలు విభాగాల్లో పనిచేసిన రజనీశ్ కుమార్ , ప్రస్తుతం ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
- Advertisement -