టీబీజీకేఎస్‌ మాట—-సింగరేణి బాట

259
MPKavitha
- Advertisement -

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో టీబీజీకేఎస్ దూసుకెళ్లింది. ప్రతి కార్మికుడి ఇంటి తలుపుతట్టిన… మిగతావాళ్లు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ.. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు అండతో కార్మికుల సంక్షేమంకోసం టీబీజీకేఎస్ సాధించిన విజయాలను వివరిస్తూ మనసులను చూరగొంది. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత  కార్మికుల కష్టాలను పరిష్కరించే బాధ్యతను భుజాన వేసుకొని భరోసా నింపింది.  పదిహేనురోజులుగా హోరాహోరీగా జరిగిన  ప్రచారంతో  టీబీజీకేఎస్‌కు కార్మికులు బ్రహ్మారథం పట్టగా ఆ సంఘం ఇచ్చిన  హామీలు కార్మికులకు భరోసాను పెంచాయి.

()సింగరేణి సంస్థ కార్మికుల వారసులకు కారుణ్య నియామకాల క్రింద మెడికల్ బోర్డులో ఇప్పుడున్నటువంటి జబ్బులకు మరికొన్ని జబ్బులు   జత చేర్చి ఉద్యోగాలు కల్పించడం. కారుణ్య నియామకం వద్దనుకుంటే ఏక మొత్తంలో రూ.25 లక్షలు లేదా నెలకు రూ. 25 వేల జీతం సర్వీస్‌ ఉన్నంతవరకు చెల్లించేటట్లు ఏర్పాటుచేయడం.

()సింగరేణి కార్మికుల పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కార్పోరేట్ ఆస్పత్రిలో వైద్యం

Elect TBGKS for growth

()సింగరేణి కార్మికుల గృహ నిర్మాణం కోసం రూ. 6లక్షల వడ్డిలేని రుణం

()సింగరేణిలో కొత్త గనులను ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం

()సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను రద్దుకోసం కేంద్రంతో చర్చలు

()సింగరేణిలో కార్మికుల క్వార్టర్స్‌కి ఎసి సదుపాయం కల్పించడం

()సింగరేణి మహిళా కార్మికులకు చైల్డ్ కేర్ లీవ్

()అనారోగ్యంతో అన్‌ఫిట్ అయిన కార్మిక సోదరులకు సూటెబుల్ జాబ్ లేదా బేసిక్ ప్రొటెక్షన్‌

()సింగరేణిలో ఉన్న క్యాడర్‌ స్కీంలు అన్నింటిని మెరుగుపరుస్తూ కోల్ ఇండియా మాదిరిగా అమలు చేయడం

()సింగరేణిలో చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్న డిసిగ్నేషన్స్  మార్పించి కార్మికుల ఆత్మాభిమానాన్ని కాపాడటం..

()ఎస్‌ఎస్‌సీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారి పుట్టిన తేదీని వారి సర్టిఫికేట్స్ ఆధారంగా మార్పించడం…వీటితో పాటు టీబీజీకేఎస్‌ ఇచ్చిన మరిన్ని హామీలు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు ప్రసాదించనుంది.

- Advertisement -