- Advertisement -
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా ఆర్మిఉద్యోగార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో అగ్నికి ఆజ్యం పోసేలా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అగ్నిపథ్ పథకంపై ప్రశంసల జల్లు కురిపించారు.
యువత దేశ రక్షణ రంగంలో చేరడానికి ఈ పథకం బంగారం లాంటి అవకాశమని ఆయన చెప్పుకొచ్చారు. నియామక ప్రక్రియను కొన్ని రోజుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆర్మీలో చేరేందుకు యువత సిద్ధం కావాలని రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.
రెండేళ్ళుగా ఆర్మీలో నియామకాలు చేపట్టలేదని, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచామని ఆయన చెప్పారు.
- Advertisement -