ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదం..13 మంది మృతి:రాజ్‌నాథ్‌

60
rajnath

తమిళనాడు ​కూనూర్​ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై లోక్ సభలో రాజ్​నాథ్​ సింగ్​ ప్రకటన చేశారు. మ. 12.08 గం.కు రాడార్‌ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి..భారీ శబ్దం రావడం వల్ల స్థానికులు అక్కడికి వెళ్లారని తెలిపారు. స్థానికులు వెళ్లేసరికి హెలికాప్టర్ మంటల్లో ఉందని…ప్రమాదంలో 13 మంది మరణించారని తెలిపారు.సీడీఎస్​ జనరల్ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన భార్య మృతిచెందడం బాధాకరం అన్నారు.

ప్రమాదంపై వాయుసేన దర్యాప్తు చేపట్టిందని తెలిపిన రాజ్‌నాథ్..దర్యాప్తు బృందానికి ఎయిర్​ మార్షల్​ మనవేంద్ర సింగ్​ నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే బృందం నిన్ననే వెల్లింగ్​టన్​కు వెళ్లి.. దర్యాప్తు ప్రారంభించిందన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన అనంతరం లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ప్రసంగించారు. కూనూర్​ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు.