ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిమిత్తం ఇక్కడికి చేరుకున్న కోవింద్‌కు బేగంపేట విమానాశ్రయంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు, నాయిని నర్సింహారెడ్డి, మహమూద్ అలీ, భాజపా నేతలు తదితరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
మధ్యాహ్నం 12.15 గంటలకు నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో జరిగే ప్రచార కార్యక్రమంలో ఆహ్వానితులను రామ్‌నాథ్ కోవింద్‌కు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌తో కలిసి కోవింద్ భోజనం చేస్తారు. అనంతరం బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు సీఎం కేసీఆర్ వీడ్కోలు పలుకుతారు. కోవింద్ వెంట కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, బీజేపీ నేతలు ఉంటారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలు కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు పాల్గొంటారు. పర్యటనలో భాగంగా రామ్‌నాథ్ కోవింద్ బేగంపేట హరితప్లాజాలో బీజేపీ, టీడీపీ ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం కోవింద్ మధ్యాహ్నం 2.45 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు.