వర్మ చేతిలో..ఎన్టీఆర్ రియల్‌ లైఫ్‌..!

183
- Advertisement -

నటదిగ్గజం ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ జీవిత చరిత్రతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బాలకృష్ణ హీరోగా సినిమా తీస్తున్నట్టు తెలిపాడు.

ఎన్టీఆర్ జీవితంలో ఉన్న వివాదాస్పద వ్యక్తులు, వివాదాస్పద అంశాలు ఈ సినిమాలో ఉంటాయని ఆయన తెలిపాడు. ఎవరికీ తెలియని విషయాలు ఇందులో ఉంటాయని చెప్పాడు.

 Ram Gopal Varma Not Direct Balakrishna NTR BIopic

తెలుగు రాజకీయ రంగాన్ని శాసించి, దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసి, చరిత్ర సృష్టించి ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నానని… ఈ సినిమాలో ఎన్టీఆర్ శత్రువులు ఎవరు, కుట్రలు చేసింది ఎవరు, కుట్రల వెనకున్న అసలు కుట్రలు ఏంటో తన సినిమాలో చూపిస్తానని చెప్పాడు వర్మ.

 Ram Gopal Varma Not Direct Balakrishna NTR BIopic

తన తండ్రి జీవిత చరిత్రతో సినిమాను నిర్మిస్తామని, అందులో తన తండ్రి పాత్రను తానే పోషిస్తానని ఇంతకు ముందు బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. తాజాగా ఆ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తానని వర్మ క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. బాలకృష్ణ హీరోగా, దివంగత ఎన్టీ రామారావు జీవిత చరిత్రను తెరపైకి ఎక్కించనున్నామని వర్మ ఇలా ప్రకటించాడో లేదో… అప్పుడే ఓ పాటను కూడా రికార్డు చేసేశాడు. స్వయంగా ఆయన పాడిన పాటను విడుదల చేశాడు కూడా. “జై ఎన్టీఆర్… జై ఎన్టీఆర్…” అంటూ ..సాగే పాట ఇప్పుడు శరవేగంగా పాప్యులర్ అయిపోతోంది. అంతేకాకుండా ఈ పాటలోని లిరిక్స్ క్యాచీగా ఉండటం విశేషం.

- Advertisement -